తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 15 (తెలుగు వెలుగు జూలూరుపాడు మండల కేంద్రంలో కొత్తగూడెం ఐఎఫ్టియు ఏరియా కమిటీ సమావేశం చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి గోపాల్ రావు. కోశాధికారి పి సతీష్ మాట్లాడుతూ ఈనెల 20న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టి యు సి ఐ లో ఐ ఎఫ్ టి యు విలీన సభను జయప్రదం చేయాలని జిల్లాలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మికులను కోరారు. టి యు సి ఐ 14 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నదని సంఘటిత సంఘటిత రంగాల్లో పనిచేస్తుందని దేశంలో కార్మిక వర్గంపై మోడీ ప్రభుత్వం 12 గంటల పని విధానం తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడని కార్మిక హక్కులను కాల రాస్తున్నాడని వీటిని తిప్పుకొట్టుటకు దేశంలో బలమైన విప్లవ కార్మిక సంఘంగా టియుసిఐ అవతరించి రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుటకు ఐఎఫ్టియుని టియుసిఐ లో విలీనం జరుగుతుందని కావున కార్మిక వర్గం అంతా కూడా ఈ యొక్క సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏం రాజశేఖర్. రాయల సిద్దు. ధనవంతురావు. వాంకుడోత్ శరత్. మధు. వెంకన్న. శంకర్.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ