Thursday, 17 September 2026 03:56:54 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రజా కవులు మాత్రమే ప్రజా చైతన్యం వైపు నడిపించగలరు ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో జరిగిన సన్మాన మహోత్సవంలో- జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Date : 06 July 2025 08:39 PM Views : 575

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలై 6 సామాజిక సమస్యలపై తన కవిత్వం ద్వారా చైతన్యం రగిలించే ప్రజాకవులు సమాజానికి పెద్ద ఆస్థిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభివర్ణించారు.ఆదివారం స్థానిక కొత్తగూడెం క్లబ్ లో ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ అవార్డు గ్రహీత,ప్రముఖ ప్రజా,ప్రకృతి కవి జయరాజ్ సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా,ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరై మాట్లాడారు.సమాజాన్ని చైతన్యం వైపు నడిపించేందుకు కవులు,రచయితలు ఎంతో మానసిక సంఘర్షణలను ఎదుర్కొంటారని పేర్కొన్నారు..అటువంటి వారిని గుర్తించి సత్కరించడం శుభపరిణామం అన్నారు .ఇంత మంచి కార్యక్రమంలో తాను భాగస్వామి కావడం ఆనందంగా ఉందని చెప్పారు....సన్మానితులుగా గుర్తింపు పొందిన ప్రతీ ఒక్కరూ ఈ ప్రాంత ప్రజలు గర్వపడే విధమైన సేవలు చేస్తున్నారని ప్రశంసించారు.

ప్రజాకవి జయరాజ్ తో పాటు వివిధ రంగాలలో విశేష సేవలందించిన మరో 14 మందిని సన్మానితులుగా ఎంపిక చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు..అనంతరం ప్రజా సంఘాల వేదిక కన్వీనర్ జే.బీ.శౌరీ మాట్లాడుతూ జయరాజ్ కేవలం కవి మాత్రమే కాకుండా,సామాజిక ఉద్యమాల యోధులని అన్నారు.ఆయన రాతల్లో ప్రతిఫలించే ప్రకృతి ప్రేమ,అంబేద్కర్ భావజాలం,మహాత్మా జ్యోతిబా ఫూలే సిద్ధాంతాలు ఈ తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని వివరించారు. సత్కారం పొందిన వారు సామాజిక న్యాయం,సామాజిక సమానత్వం కోసం తమ జీవితాన్ని అంకితం చేసి,ప్రజల్లో చైతన్యం కలిగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు..ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన అంబేద్కర్ వాదులు,సామాజిక ఉద్యమకారులు,ప్రకృతి ప్రేమికులను అభినందించారు..అనంతరం సత్కారం పొందిన సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ ఈ గుర్తింపు తమపై మరింత బాధ్యతను పెంచిందని,సమాజంలో హక్కుల పరిరక్షణ,సామాజిక చైతన్యం కోసం నిరంతరం కృషి చేస్తామని భావోద్వేగంతో ప్రకటించారు...

ప్రజాకవి జయరాజ్ మాట్లాడుతూ తనకు లభించిన ఈ సన్మానాన్ని సమాజానికి అంకితం చేస్తూ,సన్మానించిన ప్రజా సంఘాల వేదికకు,ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు తాళ్లూరి వెంకటేశ్వరరావు,కోచ్ మాస్టర్ షమీ ఉద్దీన్,ఎస్.కె.బాసిత్,కాల్వ దేవదాస్,మొక్కల వెంకటయ్య,వేల్పుల భాస్కర్,ప్రకృతి వైద్యులు సుగుణారావు,కో-చైర్మన్ కూసపాటి శ్రీను,బిక్కసాని నాగేశ్వరరావు,యెర్రా కామేష్,మారపాక రమేష్ కుమార్,శనగ.వెంకటేశ్వర్లు, కోచర్ల కమలరాణి,చదలవాడ సురేష్ తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :