Sunday, 02 August 2026 08:08:01 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 30 March 2026 04:14 PM Views : 216

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి లో స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించే విధంగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, గృహ నిర్మాణ శాఖాధికారి రవీంద్రనాథ్‌లతో కలిసి కలెక్టర్ ప్రజల వినతిపత్రాలను స్వయంగా స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించగా, వాటిని శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఎండార్స్ చేసి తక్షణ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో స్వీకరించిన పలు దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుపై శాఖాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులో చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సమర్థవంతమైన పరిపాలన అందించడంలో అధికారులు కట్టుబడి ఉండాలని తెలిపారు.

ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని దరఖాస్తులు: * కొత్తగూడెం మేదరబస్తీకి చెందిన మహమ్మద్ అబ్దుల్ వహాబ్, అశ్వరావుపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 911/33లో 5.00 గుంటల రిజిస్టర్ భూమి తన పేరున ఉన్నప్పటికీ, ఆర్ఎస్ఆర్ (RSR) సమస్య కారణంగా పట్టాదారు పాస్‌పుస్తకం అందలేదని తెలిపారు. తన పేరున పట్టాదారు పాస్‌పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం భూభారతి విభాగానికి ఎండార్స్ చేశారు. * టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామానికి చెందిన ఆంగోతు సంతులాల్, సర్వే నంబర్ 239/282లో వ్యవసాయ భూమి ఉన్నదని, గతంలో ఇంద్రజల ప్రభ పథకం కింద బోరు మరియు విద్యుత్ మంజూరు అయినప్పటికీ, మోటార్ మీటర్‌కు సర్వీస్ నంబర్ ఇవ్వలేదని తెలిపారు. తన విద్యుత్ కనెక్షన్ కొనసాగించేలా సర్వీస్ నంబర్ మంజూరు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి విద్యుత్ శాఖ అధికారికి ఎండార్స్ చేశారు. * అల్లపల్లి మండలం చెలగట్టు గ్రామానికి చెందిన కొమరం సారమ్మ, తన భర్త మరణంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని, పీజీ (ఎంఏ) వరకు చదువుకున్న తన కుమార్తెకు ఉపాధి కల్పించాలని కోరుతూ సమర్పించిన దరఖాస్తును పరిశీలించి ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి కు ఎండార్స్ చేశారు. * కొత్తగూడెం మేదరబస్తీ 53వ డివిజన్‌కు చెందిన శ్రీనివాస్, గత ఎనిమిదేళ్లుగా తమ ఇంటికి కిన్నెరసాని మంచినీటి సరఫరా నిలిచిపోయినప్పటికీ నీటి బిల్లులు విధిస్తున్నారని తెలిపారు. నీటి బిల్లులను రద్దు చేసి కొత్త కనెక్షన్ మంజూరు చేయాలని కోరుతూ సమర్పించిన దరఖాస్తును పరిశీలించి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎండార్స్ చేశారు. * పినపాక, ఏడుళ్ల బయ్యారం, జానంపేట మరియు టి. కొత్తగూడెం పరిసర ప్రాంతాలకు చెందిన ముస్లిం సోదరులు, రంజాన్ మరియు బక్రీద్ పర్వదినాలలో సామూహిక నమాజ్ నిర్వహించేందుకు తగిన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈద్గా స్థలం కేటాయించాలని కోరుతూ సమర్పించిన దరఖాస్తును పరిశీలించి పినపాక తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :