తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు భద్రాచలం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో అర్దరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టిన భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ భద్రాచలం పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను ఉపేక్షించేది లేదని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.గంజాయి,మద్యం,డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై కొంతమంది యువత సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.ఇకపై భద్రాచలం పట్టణంలో పోలీసు వారు అనుమానిత ప్రాంతాల్లో,గంజాయి హాట్స్పాట్స్ గా గుర్తించిన ప్రదేశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.భద్రాచలం మీదుగా వివిధ ప్రాంతాల నుండి ఎలాంటి నిషేధిత పదార్థాలు తరలి వెళ్లకుండా పగలు,రాత్రి తేడా లేకుండా పోలీసులు వాహన తనిఖీలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.భద్రాచలం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఆకతాయిలు గంజాయి సేవిస్తున్నట్లు గానీ,రవాణా చేస్తున్నట్లుగానే సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు.ఇందులో భాగంగానే నిన్న అనగా 25.06.2025 రాత్రి సమయంలో ఏఎస్పీ భద్రాచలం పట్టణంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
Admin
తెలుగు వెలుగు టీవీ