తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 10 తెలుగు వెలుగు) బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం తాసిల్దార్ ఆఫీసులో మెమోరాండం ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ రెండు లక్షల వ్యవసాయ రుణమాఫీని 50% రైతులు మాత్రమే అయినది, రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి రావడం బాధాకరం, రైతులందరికీ ఎంత అప్పు ఉన్నా సరే మీరు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రూపాయలు మాఫీ చేయాలి. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ శాతం రైతులకు పహాని నక్కల్ మీదనే లోను తీసుకున్నారు , షరతులు లేకుండా రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలి రైతు భరోసా పేరుతో ఎకరాకు ఏడాదికి 15000 రూపాయలు ఖరీఫ్, రబీ కలుపుకొని మేనిఫెస్టోలో పేర్కొని నేటి వరకు ఖరీఫ్ పంటకు డబ్బులు ఇవ్వలేదు, వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పి నేటి వరకు ఇవ్వలేదు, రైతుల పండించిన అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి, సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి రైతులని కాంగ్రెస్ పార్టీ మోసం చేసినది, పంటలు అతివృష్టి,అనావృష్టి వల్ల నష్టపోయినప్పుడు వాటికి బీమా సౌకర్యం కాంగ్రెస్ పార్టీ అమలు చేయట్లేదు, ఇప్పటికైనా సరే ప్రధానమంత్రి పసల బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతులకు ఇచ్చిన హామీలు అన్నిటినీ అమలు చేయాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, జిల్లా నాయకులు తెల్లం నరసింహారావు, నున్న రమేష్, బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి సిరిపురపు పుల్లారావు, నాగ శ్రీను, వెంకట్రావు గోపాలరావు వెంకటేశ్వర్లు, చిలుకూరి కిరణ్, రైతులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ