Wednesday, 16 September 2026 09:52:59 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

వారాంతపు సంత నిర్వహణపై బీజేపీ ఆందోళన

Date : 19 August 2026 03:19 PM Views : 98

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో వారాంతపు సంతను కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వ్యాపారుల నుంచి టాక్స్ పేరుతో వసూళ్లు చేస్తున్నప్పటికీ, సంత నిర్వహణకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దుర్మార్గమని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంత నిర్వహించే ప్రాంతంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉండటంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా చిన్నపాటి వర్షం కురిసినా ఈ ప్రాంతం మొత్తం మురుగునీటితో నిండిపోయి, అపరిశుభ్రతకు నిలయంగా మారుతోందని అన్నారు. వ్యాపారులు మురుగునీటి మధ్యలోనే తమ సరుకులను ఏర్పాటు చేసుకుని విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని, దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. అదేవిధంగా, ప్రస్తుతం సంతను నేషనల్ హైవేకు ఇరువైపులా నిర్వహించడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు, పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజల భద్రత, వ్యాపారుల సౌకర్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి, వారాంతపు సంతకు సురక్షితమైన, అనుకూలమైన ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని కేటాయించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని జాటోత్ వెంకన్న నాయక్ తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :