తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా, ఉద్యమమే ఊపిరిగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవించారని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో స్వీట్ షాప్ రమణ షేట్, సూరిబాబు, ఖాజా భక్ష్, పూర్ణచందర్, షణ్ముఖ సాయి, శ్రావణ్ కుమార్, ఉపేంద్ర, నాగరాజు, రాణమ్మ, వరలక్ష్మి, ఇందిరమ్మ, నిర్మల, భారతి, లక్ష్మి, సత్యవతి, నరసమ్మ, శాంతి, చిన్నారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ