Tuesday, 03 November 2026 07:37:14 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

దేశంలోనే తొలి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కొత్తగూడెంలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ వీసీ,విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణాతో మంత్రి తుమ్మల భేటీ

Date : 22 October 2025 06:45 PM Views : 441

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దేశంలోనే తొలి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కొత్తగూడెంలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ వీసీ,విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణాతో మంత్రి తుమ్మల భేటీ ఆధునిక మౌళిక సదుపాయాలతో ప్రతిష్టాత్మక ప్రణాళిక CSR నిధుల సమీకరణకు మంత్రి తుమ్మల కృషి దేశంలోనే తొలి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని కొత్తగూడెంలో అత్యాధునిక వసతులతో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠమైన ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సెక్రటేరియట్‌లో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌, విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణాతో సమావేశమయ్యారు.యూనివర్సిటీ నిర్మాణ ప్రగతిపై చర్చించి, అవసరమైన సూచనలు చేశారు. ప్రపంచంలో రెండో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ – కొత్తగూడెం లో మంత్రి తుమ్మల మాట్లాడుతూ కొత్తగూడంలోని మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా మార్చుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ విద్యా చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.ఇది భారతదేశంలో తొలి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కాగా, ప్రపంచంలో రెండోది మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.ప్రతిష్ఠాత్మక ఈ విద్యాసంస్థకు మాజీ ప్రధాని, ఆర్థికవేత్త డాక్టర్‌ మన్మోహన్ సింగ్ పేరు ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం గౌరవప్రదమైన నిర్ణయం తీసుకున్నదని తెలిపారు.ఆధునిక సదుపాయాలు కలిగిన క్యాంపస్‌ కావాలి” – మంత్రి తుమ్మల యూనివర్సిటీని అన్ని రకాల ఆధునిక మౌళిక సదుపాయాలతో, భవిష్యత్‌ తరాలకు అనుగుణంగా రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.విద్యార్థులు, అధ్యాపకులు సౌకర్యవంతమైన వాతావరణంలో నేర్చుకునేలా తరగతి గదులు, హాస్టళ్లు, గ్రంథాలయాలు,ప్రయోగశాలలు నిర్మించాలన్నారు. యూనివర్సిటీ భవన నిర్మాణ రూపకల్పనను దేశంలోని అగ్రశ్రేణి ఆర్కిటెక్ట్‌ల ద్వారా రూపొందించి, అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన మోడల్‌గా తీర్చిదిద్దాలని సూచించారు.Ph.D. కోర్సులు వచ్చే ఏడాది నుంచే ప్రస్తుతం ఉన్న మైనింగ్ యూనివర్సిటీలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ (UG) మరియు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (PG) కోర్సులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచే Ph.D. కోర్సులు ప్రారంభించాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ (UGC) తో చర్చలు జరిపి అవసరమైన అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు.ఈ యూనివర్సిటీ నుంచి భవిష్యత్‌ భూశాస్త్రవేత్తలు, ఖనిజ నిపుణులు, పర్యావరణ శాస్త్రవేత్తలు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు” అని తుమ్మల విశ్వాసం వ్యక్తం చేశారు.CSR నిధులతో ప్రాజెక్ట్‌ ముందుకు ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ నిర్మాణానికి అవసరమైన భారీ నిధుల సమీకరణ కోసం NMDC, సింగరేణి, కోల్ ఇండియా సంస్థల ప్రతినిధులతో ఇప్పటికే చర్చించినట్లు మంత్రి తెలిపారు.వారి CSR ఫండ్‌ ద్వారా యూనివర్సిటీకి నిధులు మంజూరు చేసేలా సమన్వయం జరుగుతోందన్నారు.వచ్చే వారంలో ముఖ్యమంత్రిని కలిసి యూనివర్సిటీ నిర్మాణ ప్రణాళిక, నిధుల అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.అప్పటివరకు ఆర్కిటెక్ట్‌ డిజైన్‌లు, ఖర్చు అంచనాలు సిద్ధం చేయాలని” అధికారులను ఆదేశించారు.300 ఎకరాల్లో భవిష్యత్‌ శాస్త్రవేత్తల కేంద్రం.కొత్తగూడంలో 300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, విద్యా–ఉపాధి రంగాల్లో నూతన దిశగా మారనుందని తుమ్మల అన్నారు.ఈ యూనివర్సిటీ తెలంగాణ విద్యా రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంది. ఇక్కడి నుంచి వేలాది మంది యువ శాస్త్రవేత్తలు తయారవుతారు. ఇది తెలంగాణకు గర్వకారణం అవుతుంది” అని మంత్రి అభిప్రాయపడ్డారు.తెలంగాణ విద్యా రంగంలో నూతన యుగానికి నాంది.ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ స్థాపనతో తెలంగాణ విద్యా రంగం కొత్త మైలురాయిని అధిగమిస్తుందని మంత్రి పేర్కొన్నారు.“భూశాస్త్రం, పర్యావరణం, ఖనిజ సంపదల వినియోగం, వాతావరణ మార్పులపై పరిశోధనలో ఈ యూనివర్సిటీ ప్రముఖ కేంద్రంగా నిలుస్తుంది.మన భవిష్యత్‌ తరాలు ప్రకృతి వనరులను సంరక్షించేందుకు శాస్త్రీయ దృష్టికోణాన్ని అలవరుచుకుంటాయని తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :