Monday, 02 November 2026 06:15:46 PM
# అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

ఇసుక రవాణాలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి : కలెక్టర్ అంకిత్

Date : 07 October 2026 05:06 PM Views : 137

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇసుక వాహనాల రాకపోకలకు సమర్థవంతమైన ప్రణాళిక రూపొందించాలి : ఎస్పీ రోహిత్ రాజు హోల్డింగ్, పార్కింగ్ ప్రాంతాలను సద్వినియోగం చేసుకోవాలి అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి జిల్లాలో ఇసుక రవాణా కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తో కలిసి బుధవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరం లో ఇసుక రవాణా, వాహనాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ ప్రాంతాలు, అక్రమ ఇసుక రవాణా తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇసుక వాహనాల రాకపోకలు అధికంగా ఉన్న మణుగూరు, చర్ల, భద్రాచలం, బూర్గంపాడు ప్రాంతాల్లో రోడ్ల సామర్థ్యం, ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాహనాల ఎంట్రీ, ఎగ్జిట్‌లను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో లారీలు రోడ్లపైకి రాకుండా అవసరానికి అనుగుణంగా దశలవారీగా వాహనాలను పంపించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. మణుగూరు, రామాంజవరం ప్రాంతాల్లో అవసరమైన హోల్డింగ్, పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి వినియోగంలోకి తీసుకురావాలని, చర్ల నుంచి భద్రాచలం మార్గంలో భారీ వాహనాల రాకపోకల కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భద్రాచలం రహదారి మరమ్మతుల నాణ్యతపై తక్షణమే పరిశీలన చేసి నివేదిక అందించాలని సూచించారు.

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ ఇసుక రవాణా పెరిగే ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా ట్రాఫిక్ మార్షల్స్‌ను అదనంగా ఏర్పాటు చేయాలని సూచించారు. మణుగూరు, చెర్ల ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా టీజీఎండీసీ అధికారులతో సమన్వయం చేసుకొని వాహనాల సాఫీ రాకపోకలకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఒకేసారి అదనంగా వాహనాలు వచ్చినప్పుడు వాటిని నియంత్రించే విధంగా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జిల్లాలోకి అక్రమంగా ఇసుక రవాణా జరిగే అవకాశాలను నిరోధించేందుకు సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని ఎస్పీ సూచించారు. సీజ్ చేసిన ఇసుకను అక్కడే నిల్వ ఉంచకుండా తదుపరి చర్యల కోసం తరలించేలా ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేయాలని తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వాహనాలు, జేసీబీలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనల ప్రకారం జరిమానాలు విధించాలని ఆదేశించారు. ఇసుక రవాణా, ట్రాఫిక్ నిర్వహణ, అక్రమ ఇసుక రవాణా నియంత్రణలో పోలీసు, రెవెన్యూ, టీజీఎండీసీ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డిఆర్ఓ పద్మావతి,కొత్తగూడెం ఆర్డీవో మధు, ఏడి మైన్స్ దినేష్, జిల్లా రవాణా శాఖ అధికారి భూషిత్ రెడ్డి, తాసిల్దారులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :