తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం.ఆగస్టు 27 (తెలుగు వెలుగు ) ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం కొత్తగూడెం పట్టణంలో జరిగింది. కొత్తగూడెం పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన కొప్పుల ఇమ్మానియేల్ (54) ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇమ్మానుయేల్ గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన ఇమ్మానియేల్ ఉదయం ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇది గమనించి ఇమ్మానియేల్ ఒంటిపై మంటలను ఆర్పి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఇమ్మానియేల్ పరిస్థితి విషమించడంతో సాయంత్రం మృతి చెందాడు. ఈ ఘటనతో హనుమాన్ బస్తీలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.
Admin
తెలుగు వెలుగు టీవీ