Thursday, 14 May 2026 02:23:09 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

పాల్వంచ లో పర్యటించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు

Date : 03 May 2025 03:59 PM Views : 934

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం మే 03 (తెలుగు వెలుగు) : మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తో కలసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బీ.ఆర్.యస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు. అందులో భాగంగా ముందుగా మాజీ మంత్రి వర్యులు వనమా వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లిన ఆయనకు వనమా పుష్పాగుచ్ఛం ఇచ్చి, శాలువ తో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుండి పాల్వంచ రూరల్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పూసల విశ్వనాథం కుమారుడు సాయి చరణ్ వివాహం సాయి రుచిత తో ఇటీవల జరగగా పాండురంగాపురం గ్రామంలోని వారి నివాసానికి వనమా వెంకటేశ్వరరావు తో కలసి వెళ్లి నూతన వధూవరులు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. పాల్వంచ పట్టణం, ఇందిరా నగర్ కాలనీ వాస్తవ్యులు మాలంపాటి గోవిందరావు మాతృమూర్తి పాపమ్మ ఇటీవల మరణించారు కాగా శనివారం నాడు జరిగిన పాపమ్మ దశదిన కర్మకు బిఆర్ఎస్ మాజీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు మాజీ మంత్రి వర్యులు వనమా వెంకటేశ్వరరావు తో కలసి హాజరై పాపమ్మ చిత్రపటానికి పూలు వేసి నివాళ్లు అర్పించారు.పాపమ్మ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు నామ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, మంతపురి రాజు గౌడ్, మల్లెల శ్రీరామ్ మూర్తి, కొట్టే వెంకటేశ్వర్లు, తాళ్లూరి జీవన్ కుమార్, మార్గం గురవయ్య, కాంపల్లి కనకేష్, చందు నాయక్, వీరు నాయక్, సింధు తపస్వి, బట్టు మంజుల, జూపల్లి దుర్గాప్రసాద్, ముత్యాల ప్రవీణ్, శేఖర్, రమేష్, రమణ, తెలంగాణ సురేష్, భూక్యా వీరు నాయక్, ఆనంద్, రామకృష్ణ, ఇక్బాల్, మున్నీర్, రజాక్, సురేష్, లోహిత్ సాయి, అఖిల్ మహర్షి, మురళి శేఖర్, పాల్వంచ రాజేష్, రేగళ్ల కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :