తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 9 జూలూరుపాడు మండలం అనంతారం గ్రామపంచాయతీ నందు మిషన్ భగీరథ డంపింగ్ హౌస్ కొరకు విద్యుత్ శాఖ వారు ప్రత్యేకంగా పవర్ లైన్ ఏర్పాటు చేసి నూతన ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు. అనంతారం గ్రామపంచాయతీ నందు డి ఎం ఎఫ్ టి ద్వారా నల్లగొండ బోడు పంచాయితీ మరియు గాంధీనగర్ పంచాయతీలకు మిషన్ భగీరథ ప్రాజెక్టు నీళ్లు డంపింగ్ ద్వారా పంపు చేసేందుకు 90 వేల లీటర్ల సంప్ హౌస్ నిర్మాణం చేశారు ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ సంపు హౌస్ ద్వారా నీళ్లు పంప్ చేయడానికి రెండు 12hp మోటార్లను వాడనున్నారు. పంప్ హౌస్ ల వద్ద విద్యుత్ సరఫరా లో అంతరాయం కలిగి నీటి పంపి ఆగిపోకుండా ఉండేందుకు డంపింగ్ హౌస్ ల వద్ద సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ ఏడిఈ ఎం రవికుమార్ తెలిపారు. ఈ నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు ఆనంతారం సర్పంచ్ కోర్సా రమేష్ కొబ్బరికాయ కొట్టి ట్రాన్స్ఫార్మర్ ను ఆన్ చేశారు. మిషన్ భగీరథ(dmpt) ఏఈ కిషోర్ మాట్లాడుతూ 90 వేల లీటర్ల సంప్ పనులు తుది దశకు చేరుకున్నాయని త్వరలోనే నీటిని నల్లబండ్లబోడు, గాంధీనగర్ పంచాయతీలకు మోటర్ల ద్వారా నీటి నీ పంపు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడిఈఎం రవికుమార్, ఏ ఈ జి ప్రవీణ్, లైన్మెన్ లు భాస్కర్, నాగరాజు డంపింగ్ హౌస్ సూపర్వైజర్ సుబ్బారావు మరియు గ్రామస్తులు ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ