తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటం - సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి - ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ - 27 పాఠశాలలను మూసివేతను 4 వేల పాఠశాలలుగా కుదించే నిర్ణయాన్ని విరమించుకోవాలి - విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి ప్రభుత్వాలు విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం తగదని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్ తీవ్రంగా విమర్శించారు. విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినూత్నంగా వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో గత 7ఏళ్లు కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 10814 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు మెరుగైన వాతావరణాన్ని అందించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ వసతి గృహాలల్లో ఏఎన్ఎం లను వర్కర్లను పూర్తిస్థాయిలో నియమించాలని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మూసివేతను తక్షణమే విరమించుకోవాలని ఇప్పటికైనా పాలకులు స్పందించి విద్యా రంగ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించకపోతే, విద్యార్థి లోకాన్ని ఏకం చేసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వరక అజిత్ హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల వినయ్ జిల్లా ఉపాధ్యక్షులు కొరిమి సంజయ్ ఏఐఎస్ఎఫ్ కొత్తగూడెం పట్టణ నాయకులు నాయకులు, రమేష్ విగ్నేష్ ప్రసాద్ విద్యార్థులు కళ్యాణి మానస వందన తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ