Thursday, 17 September 2026 12:53:49 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సదరం క్యాంపును పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 28 October 2025 04:12 PM Views : 449

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న దివ్యాంగుల వైకల్యం నిర్ధారణ సదరం క్యాంపును జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపులో దివ్యాంగుల వైద్య పరీక్షలు మరియు ఆన్‌లైన్ దరఖాస్తుల ఎంట్రీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. దివ్యాంగులు ఆసుపత్రికి వచ్చిన క్రమంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను, సేవల లభ్యతను, నిర్ధారణకు ఉపయోగిస్తున్న పరికరాల పనితీరును కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటుందని, ప్రతి దివ్యాంగుడికి అవసరమైన గుర్తింపు మరియు సర్టిఫికేషన్ అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ (UDID) కార్డులు తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా గుర్తింపు పొందుతాయని ఆయన తెలిపారు. ఈ కార్డుల ద్వారా దివ్యాంగులు ఆరోగ్య, విద్య, ఉపాధి, రవాణా వంటి రంగాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సులభంగా పొందగలరని పేర్కొన్నారు. ప్రతి దివ్యాంగుడు సమాజంలో సమాన హక్కులు, అవకాశాలు పొందేలా ప్రభుత్వ యంత్రాంగం సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా యూడీఐడీ కార్డుల కోసం దరఖాస్తు చేసిన దివ్యాంగులకు ఆసుపత్రిలో వైకల్యం నిర్ధారణ కోసం సదరం స్లాట్‌ బుకింగ్‌ చేయాలని, ముందుగానే దరఖాస్తుదారులకు సమాచారం అందించి సమయానికి పరీక్షలు జరిగేలా చూడాలని ఆయన సూచించారు. వైద్య పరీక్షల సమయంలో అవసరమైన వైద్య నిపుణులు, పరీక్షా పరికరాలు, మరియు సాంకేతిక సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే క్యాంపు ప్రాంతంలో దివ్యాంగులు ఇబ్బంది పడకుండా రిసెప్షన్‌ సెంటర్‌, కుర్చీలు, నీడ, తాగునీరు, టాయ్‌లెట్స్‌, ర్యాంప్‌, వీల్‌చెయిర్‌ వంటి ప్రాథమిక వసతులు కల్పించాలని సూచించారు. దివ్యాంగులకు అనుకూలమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావించాలని ఆయన అన్నారు. పరీక్షల అనంతరం ప్రతి దివ్యాంగుడి వైకల్యం శాతం, వ్యక్తిగత వివరాలు మరియు వైద్య నిపుణుల సర్టిఫికేషన్ వివరాలను సమగ్రంగా యూడీఐడీ పోర్టల్‌లో నమోదు చేయాలని, ఎటువంటి లోపాలు లేకుండా డేటా ఎంట్రీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దివ్యాంగుల సమాచారం డిజిటల్ రూపంలో భద్రపరచడం వల్ల భవిష్యత్తులో వివిధ పథకాల అమలుకు అది బలమైన ఆధారంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, వైద్య నిపుణులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :