Thursday, 17 September 2026 04:25:39 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేవారిని, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసేవారిని ఉపేక్షించేది లేదు – జిల్లా ఎస్పీ

Date : 27 August 2026 05:56 PM Views : 1983

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి, అనంతరం అధిక మొత్తాలను వసూలు చేస్తూ ఇబ్బందులకు గురిచేసే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ హెచ్చరించారు. అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి, రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో ప్రజలను బెదిరించడం, వేధింపులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. ప్రజలు తమ ఆర్థిక అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రుణం తీసుకునే ముందు వడ్డీ, తిరిగి చెల్లింపు విధానం తదితర వివరాలను పూర్తిగా తెలుసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతను ప్రలోభాలకు గురిచేసి, వారి నుంచి డబ్బులు వసూలు చేసే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ముందస్తుగా డబ్బులు వసూలు చేసే వ్యక్తుల మాటలు నమ్మవద్దని, ఉద్యోగాల కోసం ఎటువంటి ముందస్తు చెల్లింపులు చేయవద్దని తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను సంబంధిత సంస్థల అధికారిక మార్గాల ద్వారా నిర్ధారించుకోవాలని సూచించారు. ఉద్యోగాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాల పేరుతో వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటిపిలు, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు, ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్న వ్యక్తుల గురించి సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసు అధికారులకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :