తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఫిబ్రవరి 18 (తెలుగు వెలుగు ) మంగళవారం సాయంత్రం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, బీసీ వెల్ఫేర్ అధికారిని ఇ. ఇందిరతో కలిసి కొత్తగూడెంలోని బీసీ కాలేజీ గర్ల్స్ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలకు చదువుతూనే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని అన్నారు. హాస్టల్లోని మెస్ , బాలికల వసతి గదులను పరిశీలించారు. విద్యార్థినిలకు అన్ని హాస్టల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, విద్యార్థిను లుఆ సౌకర్యాలు సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం భోజన నాణ్యత పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ