తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 5 (తెలుగు వెలుగు) : పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో శ్రీశ్రీ ఎన్ అండ్ ఆర్ ఫాంల్యాండ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ పోటీలను టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ఆదివారం ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం వారితో కలిసి బ్యాటింగ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుందని భద్రాద్రి జిల్లాలో క్రీడాకారులకు కొదవలేదని వారిలో దాగిఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి టోర్నమెంట్ లు ఉపయోగపడతాయన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ