Wednesday, 16 September 2026 04:24:24 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

బడిబాట గ్రామ సభలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 06 June 2025 05:44 PM Views : 566

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చేర్పించి వారికి బంగారు భవిష్యత్తును కల్పించడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం బడిబాట కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా కరకగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, అనవసరంగా డబ్బులు ఖర్చు చేసి విద్యను కొనుక్కోవలసిన అవసరం తల్లిదండ్రులకు లేదని సూచించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లను చేర్పించి వాటిని బలోపేతం చేయవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తుందన్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన, ఉచిత వైద్య పరీక్షలు, అత్యున్నత విద్యార్హత కలిగిన ఉపాధ్యాయులతో విద్యాబోధన వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని కలెక్టర్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరం కరకగూడెంలోని జవహర్ నవోదయ విద్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రారంభోత్సవానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, వేరువేరు ప్రదేశాల నుండి ఈ విద్యాలయానికి విద్యార్థులు ప్రవేశం పొందుతారు కావున వారిని కూడా మన సొంత పిల్లల్లాగానే ఆదరించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని, నవోదయ విద్యాలయం ద్వారా దేశంలోనే అత్యంత నాణ్యమైన విద్యను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థినీ విద్యార్థులకు అందుబాటులోకి రావడం మన జిల్లా అదృష్టమని కలెక్టర్ అన్నారు. జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటు జరుగుతున్న పనులను పరిశీలించి, జూన్ 12 నాటికల్లా అన్ని రకాల పనులు పూర్తిచేసి పాఠశాల ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, కరకగూడెం తాసిల్దార్,జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ నాగరాజు శేఖర్, కరకగూడెం మండల విద్యాధికారి మంజుల, విద్యాశాఖ ఇంజనీరింగ్ డీఈ, ఏఈ, మండల సమాఖ్య సభ్యులు మరియు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :