తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : పాల్వంచ పెద్దమ్మ గుడిలో ఈనెల 12న శనివారం పౌర్ణమి రోజున చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రజనీకుమారి బుధవారం తెలిపారు. చండీ హోమంలో పాల్గొనే భక్తులు ముందు రోజు, అదే రోజు కానీ రూ. 2516/-చెల్లించి గోత్ర నామాలతో టికెట్ పొందాలన్నారు. హోమంలో పాల్గొన్న దంపతులకు శేష వస్త్రాలతో పాటు ఉచిత అన్న ప్రసాదం ఏర్పాటు చేశామన్నారు. హోమంలో పాల్గొనే దంపతులు సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ