Thursday, 17 September 2026 08:44:26 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

కేజీబీవీ వర్కర్స్ అక్రమ అరెస్టులను ఖండించిన,టి యు సి ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు డిమాండ్

Date : 22 September 2025 04:21 PM Views : 339

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 22 తెలుగు వెలుగు ) : ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) అనుబంధ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్అ సోసియేషన్ కార్మికుల డిమాండ్ల సాధనకు ఇచ్చిన "సెప్టెంబర్ 22 ఛలో ఎస్.పి.డి. కార్యాలయం" పిలుపును భగ్నం చేసేందుకు చేసిన అక్రమ అరెస్టులను టి యు సి ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కనీస వేతనాలను రూ.26 వేలు చేయాలనీ, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పోస్టులను భర్తీ చేయాలనీ, కుక్, స్వీపర్, స్కావెంజర్, వాచ్ ఉమెన్ పోస్టులకు 10వ తరగతి విద్యార్హత నిబంధన తొలగించాలనీ, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ కల్పించాలనీ, ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఇవ్వాలనే తదితర డిమాండ్లపై శాంతియుతంగా జరప తలపెట్టిన కార్యక్రమాన్ని భగ్నం చేయపూనుకోవడం శోచనీయమని ఆయన తెలిపారు. అధికారానికి రాక ముందు "ఆక్యుపై ఇందిరా పార్కు' ఆందోళనలో భాగస్వామయమైన కాంగ్రెస్, 7వ డిమాండ్గా ప్రజాస్వామ్యాన్ని హామినిచ్చిన కాంగ్రెస్ అధికారానికి వచ్చాక ఇలా అప్రజాస్వామికంగా కార్మిక గొంతులు నొక్కాలని చూడడం అత్యంత హేయమైన చర్య అని ఆయన స్పష్టం చేశారు.ఎస్.పి.డి. కార్యాలయం దగ్గర నిరసన తెలిపేందుకు అనుమతినిచ్చిన పోలీసులు అక్రమ అరెస్టులకు పూనుకోవడం దుర్మార్గకరమన్నారు. తమ సమస్యల గురించి అధికారులకు చెప్పుకొనేందుకు ఆదిలాబాద్, నిర్మల్, నారాయణపేట, పెద్దపల్లి, సూర్యాపేట, నాగర్ కర్నూల్, ,మహబూబ్నగర్ జిల్లాల నుండి బయలుదేరిన కేజీబీవీ వర్కర్లను, టీయుసీఐ రాష్ట్ర నాయకులు గంగన్న, జగన్, నరసింహ, కేజీబీవీ రాష్ట్ర నాయకులు రాజేశ్వరి, లీలమ్మ, తదితరులను అరెస్టు చేశారని,వీరిని వెంటనే విడుదల చేయాలని గోపాలరావు డిమాండ్ చేసారు. ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించుకునే కార్యక్రమాలను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని,ఇటువంటి అప్రజాస్వామ్యక చర్యలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గోపాలరావు డిమాండ్ చేసారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :