తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డ్రైనేజీ నిర్మాణ పనులు త్వరితగతన పూర్తి చేయాలి జాతీయ రహదారిపై 16 వ డివిజన్ పరిధిలో జరుగుతున్న సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఆ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ పరిశీలించారు. ఆదివారం కాలువ నిర్మాణం పనులను పరిశీలిస్తూ అధికారులతో మాట్లాడారు.గత 20 రోజుల నుండి చిరు వ్యాపారులు కాలువ నిర్మాణం వల్ల కొన్ని ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె అన్నారు. తక్షణమే నాణ్యత తో కూడిన కాలువ నిర్మాణం చేపట్టి, కాలువ పనులు త్వరిత గతిన పూర్తి చేసి నేషనల్ హైవే కాలువకు ఆనుకొని వ్యాపారం సాగిస్తూ జీవిస్తున్న వ్యాపారులకు సహకరించాలని ఆమె అధికారులకు విజ్ఞప్తి చేశారు.ఆమె వెంట మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ