Thursday, 17 September 2026 04:24:26 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఆయిల్ పామ్ సాగు రైతుల ఆర్థిక స్థిరత్వానికి బలమైన పునాది : మంత్రి తుమ్మల

Date : 21 July 2026 05:37 PM Views : 147

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గిరిజన కుటుంబాల ఆదాయం పెరిగితేనే పిల్లల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుంది మరో 10 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరిస్తే పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే పంటల మార్పిడే ప్రత్యామ్నాయం ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి పొలంలో ఫామ్ పాండ్ నిర్మించుకోవాలి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందించడమే నా జీవిత లక్ష్యం రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ములకలపల్లి మండలంలో మంగళవారం నిర్వహించిన ఆయిల్ పామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా, జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, నీటి సంరక్షణ, గోదావరి జలాల వినియోగం తదితర అంశాలపై రైతులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గిరిజనులకు రహదారులు, తాగునీరు, విద్యుత్, వైద్యం, విద్య వంటి మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు, ప్రతి మండలంలో గురుకులాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. గిరిజన పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి కలెక్టర్లు, ఉన్నతాధికారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, అడవి జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయని పేర్కొన్నారు. మర్రి, వెదురు, చింత వంటి స్థానిక జాతుల మొక్కలను విస్తృతంగా నాటి అడవులను పరిరక్షించాలని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఇప్పటికే 35 శాతం వర్షపాతం లోటు నమోదైందని, భూగర్భ జలాలు కూడా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా సాధారణం కంటే 20 నుంచి 30 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున బోర్లపై ఆధారపడి వరి సాగు చేయకుండా తక్కువ నీటి అవసరం ఉన్న ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. పెసర, మినుము, కంది, అలసంద వంటి అపరాల సాగును విస్తరించాలని కోరారు. పత్తి సాగు చేసే రైతులు ప్రతి నాలుగు లేదా ఆరు వరుసలకు ఒక వరుస కందిని అంతర పంటగా సాగు చేస్తే అదనపు ఆదాయం లభించడంతో పాటు భూమి సారం పెరుగుతుందని తెలిపారు. ములకలపల్లి మండలంలో ప్రస్తుతం 8 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, మరో 10 వేల ఎకరాల్లో సాగు విస్తరిస్తే వెంటనే పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని మంత్రి ప్రకటించారు. పోడు భూముల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి సౌర విద్యుత్ సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయిల్ పామ్‌తో పాటు మునగ, పప్పుధాన్యాలను అంతర పంటలుగా సాగు చేస్తే అదనపు ఆదాయం లభించడంతో పాటు భూమి సారం పెరుగుతుందని చెప్పారు. ప్రపంచ మార్కెట్లో మునగ ఆకుకు మంచి డిమాండ్ ఉన్నందున రైతులు ఆదాయాన్ని పెంచే పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు రైతుల ఆర్థిక స్థిరత్వానికి బలమైన పునాదిగా నిలుస్తుందని అన్నారు . గిరిజన గ్రామాల్లో ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గిరిజన కుటుంబాల ఆదాయం పెరిగితేనే వారి పిల్లల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుందని చెప్పారు. గురుకులాలు, ఏకలవ్య పాఠశాలల్లో అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలను గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టడం నేటి అవసరమని , ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి రైతు తన పొలంలో ఫామ్ పాండ్ నిర్మించుకుని వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి భవిష్యత్తులో వ్యవసాయానికి ఉపయోగపడతాయని తెలిపారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జిల్లాలోని అన్ని ప్రాంతాలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తయిన వెంటనే సీతారామ ప్రాజెక్టు ద్వారా చెరువులను నింపనున్నామని తెలిపారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి రైతులు సహకరిస్తే పనులు వేగంగా పూర్తిచేసి ప్రతి రైతు పొలానికి గోదావరి జలాలు అందిస్తామని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందించడమే తన జీవిత లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం గణనీయంగా తగ్గిందని, సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల, విద్యుత్, పశుసంవర్ధక, మిషన్ భగీరథ తదితర శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 90 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, ఈ ఏడాది కొత్తగా 15 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా నిర్దేశించామని తెలిపారు. వరికి బదులుగా మొక్కజొన్న, మిర్చి, ఆయిల్ పామ్, కూరగాయలు, పప్పుధాన్యాలు వంటి తక్కువ నీటి అవసరం ఉన్న పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆయిల్ పామ్ నాలుగో సంవత్సరం నుంచి దిగుబడిని ఇవ్వడం ప్రారంభించినప్పటికీ, సుమారు 30 సంవత్సరాల పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే పంటగా నిలుస్తుందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ వివరించారు. అనంతరం ఆత్మనిర్భర్ మిషన్ అపరాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం కంది, మినుము విత్తనాలను 50 శాతం రాయితీపై అందిస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి, జిల్లా కలెక్టర్ రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. రైతులు సమీప వ్యవసాయ అధికారులు లేదా వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, ఆయిల్ పామ్ సంస్థ ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :