Wednesday, 16 September 2026 09:52:15 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సాయుధ దళాల దినోత్సవం సందర్భంగా పతాక నిధికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తొలి విరాళం

Date : 05 December 2025 07:19 PM Views : 261

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సాయుధ దళాల దినోత్సవ పతాక నిధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ తొలి విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న సైనికుల కోసం పతాక నిధికి ప్రతి పౌరుడు తన వంతు సహకారం అందించడం దేశభక్తి, సామాజిక బాధ్యతకు ప్రతీక అని తెలిపారు. కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ సరిహద్దుల్లో ప్రతికూల పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న భారత సైన్యం, నౌకాదళం, వాయుసేన సిబ్బంది త్యాగాలను ప్రతి భారతీయుడు గౌరవించాలని అన్నారు. వీరి కుటుంబాల సంక్షేమం కోసం పతాక నిధి వినియోగించబడుతుందని పేర్కొంటూ జిల్లా ప్రజలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక వర్గాలు, వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొని విరాళాలు అందించాలని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరజవాన్ల కుటుంబాల పట్ల సమాజం అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. పతాక నిధి ద్వారా వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు, సేవలలో గాయపడిన రక్షణ సిబ్బందికి ఆర్థిక సహాయం అందించబడుతుందని వివరించారు. ప్రతి సంవత్సరం సాయుధ దళాల దినోత్సవం సందర్భంగా ఈ నిధి సేకరణ ద్వారా దేశ రక్షణ వ్యవస్థ పట్ల ప్రజల సమగ్రత, ఐక్యత మరింత బలపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి ఎం చంద్రశేఖర్, వింగ్ కమాండర్ రిటైర్డ్ సురేందర్, ఆర్మీ రిటైర్డ్ సుభాని, కృష్ణమూర్తి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :