తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ మొదలు పెట్టిన పార్టీ ఉద్యమి సభ్యత్వం నమోదు అనేది మహోన్నత ఆశయాలతో నిండిన యజ్ఞం. పార్టీ సిద్ధాంతాలను నమ్మిన ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలు సభ్యత్వ నమోదును భావోద్వేగంతో చేస్తున్నారు. దేశంలో ఐదు రాష్ట్రాలలో జనసేన సభ్యత్వాలు ముమ్మరంగా సాగుతున్నాయని, మనమంతా బాధ్యతగా దానిని ముందుకు తీసుకెళ్లాలి అని జనసేన సాదక్, జన సైనికులకు లకు జూలూరుపాడు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఉసికల రమేష్ సూచించారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జనసైనికులు ప్రమాదవశాత్తు మరణం సంభవించినట్లయితే వారి కుటుంబానికి ప్రమాద బీమా కింద ఐదు లక్షల రూపాయలు పార్టీ ఇవ్వనుందని తెలిపారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈనెల 10వ తారీకు వరకే ఉండనుందని ఈ తక్కువ టైంలోనే క్షేత్రస్థాయి నుంచి పక్కా ప్రణాళికతో సభ్యత్వ నమోదును అత్యంత పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు మీద జనసేన పార్టీ సాదక్ మరియు జనసైనికులు పూర్తి సమయాన్ని కేటాయించి ఈ వారం రోజుల లో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దామని పిలుపునిచ్చారు
Admin
తెలుగు వెలుగు టీవీ