తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో ని కొత్తపేట బజారు కి వెళ్లే రహదారిపై బొంగా పగిలి నాలుగు నెలలు గడుస్తున్న పట్టించుకోని పంచాయతీ అధికారులు. గ్రామస్తులు ఉదయం లేచిన దగ్గర నుండి ఈ దారి గుండానే ఎక్కువ మంది ప్రధాన రహదారికి వెళ్తుంటారు మరియు పశువులు, అరకలు కోటేరుగా వెళుతుంటారు ఇక్కడ దాటడానికి ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. టూ వీలర్స్ అయితే ఇప్పటివరకు నలుగురు వ్యక్తులు డ్రైనేజీలో పడ్డారని స్థానికులు చెబుతున్నారు.ఇకనైనా అధికారులు స్పందించి పగిలిన బొంగ తీసివేసి కొత్త బొంగ వేయవలసిందిగా గ్రామస్తులు అభ్యర్థిస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ