తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (అర్బన్) కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్లో మేడే జెండాలు రెపరెపలాడా యి .డివిజన్ పరిధిలో మూడు చోట్ల ముఖ్య అతిథిగా విచ్చేసిన 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ పాల్గొని సీనియర్ మహిళలతో కలిసి మేడే జెండాలు ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కార్మికుడే ఈ దేశ సంపద సృష్టికర్తఅని, కార్మికుడిని అనగదొక్కాలని ఏ ప్రభుత్వాలు ప్రయత్నించిన అది మనుగడ సాధించవని ఆమె తెలిపారు. 1886లో చికాగో నగరంలో కార్మికుల రక్తంలో తడిసిన ఎర్రటి జెండానే మేడే జెండా అన్నారు. పేద ప్రజల, కార్మికుల ,కర్షకుల అండదండ ఎర్రజెండా మాత్రమే పిలుపునిచ్చారు .ఆకాశ హర్మ్యాల నుండి మురికి కాలువల ప్రక్షాళన వరకు, ఫ్యాక్టరీల నుండి పొలాల వరకు ,ప్రతి ఇటుక వెనుక కార్మికుడు చెమట చుక్కలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ కార్మికులారా !ఏకం కండి! అని కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు న్యాయవాది మునగడప వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు బయన్న ఈశ్వరయ్య, ముద్దం మార్తమ్మ, ఫాతిమాభి, రామ్ రాకేష్, వాసం బాబు, మేడిపల్లి అశోక్, సలీం, అక్బర్, కోటేశ్వరి, రామ్ రాధా, సంపత్, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ