Wednesday, 16 September 2026 02:04:53 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ఉల్లాసంగా భద్రాచలంలో ఒలంపిక్ డే రన్

Date : 21 June 2025 09:06 AM Views : 686

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఒలంపిక్ డే సందర్భంగా 18 తారీకు పాల్వంచలో మొదలైన ఒలంపిక్ రన్ నిన్న దమ్మపేట చేరుకుని ఈరోజు ఉదయం 6:30 కి భద్రాచలం లో ఒలంపిక్ క్రీడా జ్యోతిని క్రీడాకారులు ఎమ్మెల్యే తెల్లం.వెంకటరావుకి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం. వెంకటరావు మాట్లాడుతూ భద్రాచలంలో ఒక 400 మీటర్ల అథ్లెటిక్స్ ట్రాక్ కోసం ఐదు ఎకరాలు స్థలం సేకరించాలని త్వరలో ఆ ట్రాక్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులో తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పిఓ బి రాహుల్ ఐఏఎస్, భద్రాచలం ఏఎస్పి విక్రమ్ కుమార్ సింగ్ ఐపీఎస్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి యుగంధర్ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ చిఎఫ్ ప్యాట్రన్ నాగా సీతారాములు మాట్లాడుతూ భద్రాచలం పరిసర ప్రాంతంలో గిరిజన క్రీడాకారులు అద్భుతంగా రానిస్తున్నారని వారికి సహకారం ఇవ్వటం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తారన్నారు. యువత గంజాయి లాంటి చెడు వ్యసనానికి పోకుండా క్రీడల వైపు మళ్లాలని భద్రాచలంని గంజాయి రహిత పట్టణంగా మార్చాలని యువతని కోరారు. జిల్లా క్రీడాకారులకు మంచి క్రీడా సదుపాయాలు కలగజేస్తే అంతర్జాతీయ క్రీడాకారులు తయారవుతారని భద్రచలంలో స్టేడియం నిర్మాణం వలన క్రీడాకారులు తోపాటు మార్నింగ్ నడక చేసెవారికి ఎంతో ఉపయోగం గా ఉంటుందని అన్నారు . అనంతరము అంబేద్కర్ సెంటర్ నుంచి ఈ ఒలంపిక్ డే రన్ సుమారు 200 మంది స్థానిక క్రీడాకారులు చాలా ఉత్సంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమము లో జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్ కే .మహిధర్ , వైస్ ప్రెసిడెంట్ వై వెంకటేశ్వర్లు జాయింట్ సెక్రెటరీ పి నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :