Friday, 18 September 2026 02:05:04 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

రేషన్ కార్డుల పరిశీలన జాబితా ఒక గందరగోళం..రేషన్ కార్డుల పరిశీలన జాబితాలో చాలామంది పేర్లు గల్లంతు..మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు డి

Date : 19 January 2025 05:47 PM Views : 833

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దరఖాస్తు చేసుకున్న చాలామంది లబ్ధిదారుల పేర్లు జాబితాలో లేకపోవడం రేషన్ కార్డు లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పదో వార్డులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రేషన్ కార్డుల లబ్ధిదారుల పరిశీలన జాబితాను దేని ఆధారంగా తయారు చేశారో అర్థం కాని అయోమయ స్థితిలో ఆ జాబితా ఉన్నదని ఆయన అన్నారు. అనేకమంది రేషన్ కార్డుల కోసం ఆన్లైన్లోను, కలెక్టర్ ఆఫీస్ లో, తాసిల్దార్ ఆఫీసుల్లో, ప్రజా పాలనలో దరఖాస్తు చేశారని వీటిలో చాలామంది పేర్లు ఈ జాబితాలో లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. గత అనేక సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా జారీ కాలేదని, ఇప్పుడైనా రేషన్ కార్డులు వస్తాయని సంతోషించిన ప్రజలకు ఈ జాబితాను చూడటంతో ఇప్పుడు కూడా రేషన్ కార్డులు రాకపోతే ఇక రేషన్ కార్డు రావడం కష్టమేనని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. కుటుంబ సభ్యుల పేర్లు, చిన్న పిల్లల పేర్లు, పెళ్లయి వచ్చిన కోడల పేర్లు చేర్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే కుటుంబ సర్వే కులగననలో రేషన్ కార్డు లేదని సర్వేలో రాయించుకున్న వారి పేర్లు కూడా అనేకమందివి రాలేదని దీన్ని బట్టి చూస్తే ఏ ఆధారంగా లబ్ధిదారుల పరిశీలన జాబితా తయారు చేశారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఇట్టి సమస్యలను కౌన్సిలర్స్ ద్వారా తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు పెన్షన్ పైనే ఆధారపడి జీవిస్తున్న సింగరేణి రిటైర్మెంట్ కార్మికులకు పెన్షన్ నిబంధనను సడలించి వారికి నూతన కార్డులు మంజూరు చేయాలని, అలాగే ఎవరి పేర్లు అయితే జాబితాలో రాలేదొ అర్హత కలిగిన వారి నుండి నూతన దరఖాస్తులు తీసుకొని వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని కూనంనేని సాంబశివరావు అధికారులను ఆదేశించినట్లు మునిగడప తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకురాలు ముద్దం మార్తమ్మ, బి జాన్ బి ,శకుంతల, ముంతాజ్, నూరి, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :