తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 34 వ వార్డ్ కూలీలైన్ లో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణం మందు బాబులకు,అసాంఘిక కార్యక్రమాలకు అడ్డ గా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల క్రీడలకు ప్రభుత్వం కేటాయించిన స్థలం లో కార్ పార్కింగ్ లకు సాయంత్రం మందు బాబులకు అర్ధరాత్రి పూట గంజాయి తాగి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బందికి గురిచేస్తున్నట్లు ప్రజలు తెలిపారు. ఎన్ని సార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ప్రహరీ గోడ ను నిర్మించకుండా నిర్ల్యక్షం వహిస్తున్నట్లు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ