Wednesday, 04 November 2026 12:15:14 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

69 వ జాతీయ కబడ్డి పోటీలకు 33 జట్లు రిజిస్ట్రేషన్ పూర్తి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 03 January 2026 06:51 PM Views : 334

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పినపాక మండలం ఏడుళ్ళ బయ్యారం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాల నందు స్కూల్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 69వ జాతీయ కబడ్డీ పోటీలు జనవరి 7వ తేదీ నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించబడు తున్న ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు జాతీయ స్థాయి విద్యా సంస్థల నుంచి భారీ స్పందన లభించిందని ఆయన తెలిపారు.ఈ పోటీలు అండర్–17 బాలుర విభాగంలో నిర్వహించబడనున్నాయని, మొత్తం 33 జట్లు ఈ పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, బిహార్, అస్సాం, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, గుజరాత్, ఢిల్లీ, చండీగఢ్, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు దాద్రా & నగర్ హవేలీ మరియు డామన్ & డియూ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయని వివరించారు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS), సీబీఎస్‌ఈ వెల్ఫేర్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్, సీఐఎస్‌సీఈ (ICSE), విద్యాభారతి వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల జట్లు కూడా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రతి జట్టు నుంచి 6 నుంచి 12 మంది క్రీడాకారులతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు.జాతీయ స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందనుందని కలెక్టర్ తెలిపారు. క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులు, అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, భోజనం, త్రాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రత, రవాణా ఏర్పాట్లు తదితర అంశాలపై పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.ఈ జాతీయ క్రీడా ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించి జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో మరింత పెంచేలా సంబంధిత శాఖలు, నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :