తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 14 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండలంలో కాకర్ల గ్రామపంచాయతీ లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బానోత్ బద్రి గెలుపు దిశగా గడప గడపకు తిరుగుతూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లాడి నరసింహారావు, ముత్తినేని గోపి, పాతర్లపాటి సతీష్, రాచ బంటి నరసింహారావు, గోసు రామకృష్ణ తో పాటు కార్యకర్తలతో కలిసి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందజేయడంలో ముందుంటానని, ప్రజా సమస్యలే నా సమస్యలుగా భావించి పరిష్కార దిశగా అడుగులు వేస్తానని అన్నారు. తనకు ఓటు వేసి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేస్తానని బానోత్ బద్రి హామీ ఇచ్చారు
Admin
తెలుగు వెలుగు టీవీ