తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 28 తెలుగు వెలుగు) : లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి 9 ఉపకులాల ఆధ్వర్యంలో చలో భద్రాచలం అంటూ కదం తొక్కారు. జూలూరుపాడు మండలం ఆదివాసి ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో అనంతారం గ్రామం నుండి ఆదివాసీలు డప్పుల దరువులతో జై ఆదివాసి జై జై ఆదివాసి అనే నినాదాలతో భద్రాచలంలో ఏర్పాటు చేసిన ధర్మ యుద్ధం బహిరంగ సభకు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసులు దేశానికి మూలవాసులని 1976 అనంతరం లంబాడాలను అప్పటి ప్రభుత్వం మోసం చేసి ఎస్టీ జాబితాలో చేర్పించిందని వారిని వెంటనే ఎస్టీ జాబితాలో నుంచి తొలగించాలని లేనిపక్షంలో శాంతియుత ఆందోళనలు కొనసాగిస్తామని అన్నారు. భద్రాచలం బహిరంగ సభకు 9 ఉపకులాల సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొని తదుపరి కార్యక్రమాలకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ