తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం గుండెపుడి రెవిన్యూ పరిధిలోని 117 సర్వేనెంబర్ గల సీలింగ్ భూమిని అక్రమంగా కొంతమంది పేరు పై పట్టా చేసి అట్టి భూమిని లీజుకి ఇవ్వడం అక్రమ అనుమతులు వలన ఎత్తైన గుట్టలను తవ్వడం ఏజెన్సీ ఏరియా లో చట్టరీత్యా నేరమని దీనివలన పర్యావరణానికి, భూమికి నష్టం కలుగుతుందని భద్రాచలంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కు బచ్చల లక్ష్మయ్య ఆదివాసి సంఘం నాయకులు ఇచ్చిన మెమొరండంకు స్పందించిన ఐ టి డి ఎ ప్రాజెక్ట్ అధికారి జూలూరుపాడు తహసిల్దార్ కు తక్షణ విచారణ చేపట్టి 15 రోజులలోగా నివేదికను అందించాలని ఆదేశించారు. దీనిపై బచ్చల లక్ష్మయ్య మాట్లాడుతూ ఐటీడీఏ భద్రాచలం ప్రాజెక్టు అధికారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ