Thursday, 17 September 2026 05:09:53 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం దర్శించుకున్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Date : 04 September 2026 03:26 PM Views : 125

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రత్యేక పూజల్లో జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి ముక్కోటి ఉత్సవాలలోపు ఉత్తర ద్వారా పనులు పూర్తిచేయాలి గోదావరి పుష్కరాల ప్రారంభం నాటికి ఘాట్,అభివృద్ధి నిర్మాణ పనులు సిద్ధం చేయాలి అధికారుల ఆదేశించిన మంత్రి పొంగులేటి భద్రాద్రి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని శుక్రవారం తెలంగాణ రెవిన్యూ, గృహ నిర్మాణ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ అంకిత్,భద్రాచలం, పినపాక,అశ్వారావుపేట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు,జారే ఆదినారాయణ లతో కలసి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దేవాలయానికి చేరుకున్నారు. మంత్రి పొంగులేటిని భద్రాచలం ఐటీడీఏ పీ.ఓ రాహుల్,ఆలయ ఈ.ఓ దామోదర్, తహసీల్దార్ రవి కుమార్, ఆలయ అధికారులు, అర్చకులు, ఘనస్వాగతం పలికారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, మంత్రి పొంగులేటి సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేసి ఆశీర్వదించారు. అనంతరం దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పున నిర్మాణ పనులను మంత్రి పొంగులేటి క్షుణ్ణంగా పరిశీలించారు.చిత్రకూట మండపం పరిసరాలను,గోశాల ప్రాంతాన్నీ,అన్నదాన సత్రం,విస్తా కాంప్లెక్స్, శివాలయానికి వెళ్లే మార్గం, ఉత్తర ద్వార దర్శనం, రామాలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు మాడవీధులను, పరిసర ప్రాంత అభివృద్ధి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అభివృద్ధికి సంబంధించిన వివరాలను సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టర్స్ ను, ఆర్కిటెక్చర్లను సకాలంలో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ఆదేశించారు.ఈ ఏడాది డిసెంబర్ నెలలో జరిగే ముక్కోటి ఉత్సవాలలోపు ఉత్తర ద్వారా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, వచ్చే ఏడాది ఏప్రిల్ లో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలలోపు అన్ని పనులు పూర్తయ్యాలా చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. అదేవిధంగా వచ్చే ఏడాది 2027 జూన్ - జులై నెలలో జరిగే గోదావరి పుష్కరాల ప్రారంభంలోపు గోదావరి పరివాహక ప్రాంతంలో గల గోదావరి ఘాట్లు నిర్మాణాలు అభివృద్ధి పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.రు. 276 కోట్ల నిధులు ఆలయ పరిసరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎటువంటి నాణ్యతా లోపాలు లేకుండా, దశాబ్దాల కాలం పాటు నిర్మాణాలు ప్రతిష్టంగా ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. దక్షిణాయోధ్యగా పేరు గడించిన భద్రాచలం పుణ్యక్షేత్రం ఆలయ అభివృద్ధికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాలలో పాల్గొని ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు.భద్రాచలం ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి వెంట వివిధ శాఖల అధికారులు,ఆలయ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :