తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పదవీ విరమణ కార్మికుల వైద్య సమస్యలపై ఏఐటీయూసీ కీలక డిమాండ్లు. సింగరేణి ప్రధాన కార్యాలయంలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీతో యాజమాన్యం సీపీఆర్‌ఎంఎస్, గ్రాట్యుటీ ట్రస్ట్ బోర్డు సమావేశాన్ని గురువారం రాత్రి 7గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పదవీ విరమణ కార్మికుల వైద్య సదుపాయాలు, సీపీఆర్‌ఎంఎస్ నిధులు, రిఫరల్ వైద్య ఖర్చుల చెల్లింపులు, గ్రాట్యుటీ తదితర అంశాలపై ఏఐటీయూసీ పలు కీలక డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది.యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ సమావేశంలో పాల్గొని పదవీ విరమణ కార్మికుల సమస్యలను వివరించారు. సీపీఆర్‌ఎంఎస్ కార్డులోని రూ.8 లక్షల పరిమితితో సంబంధం లేకుండా హార్ట్, రీనల్, న్యూరాలజికల్, క్యాన్సర్, ఎయిడ్స్, సెరిబ్రల్ ఫీవర్, తీవ్రమైన ప్రమాదాలు తదితర అనారోగ్య సమస్యలకు వైద్యం అందించాలని కోరారు. దీనిపై యాజమాన్యం సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.హైదరాబాద్ ఆస్పత్రులకు రిఫరల్‌పై వెళ్లి కార్మికులు అదనంగా చెల్లించిన వైద్య ఖర్చుల బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని, ఈ ప్రక్రియను ఆన్‌లైన్ చేసి త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చూడాలని ఏఐటీయూసీ కోరింది. సీపీఆర్‌ఎంఎస్ ట్రస్ట్‌లో ప్రస్తుతం సుమారు రూ.116 కోట్లు మాత్రమే ఉన్నందున, భవిష్యత్ వైద్య అవసరాల కోసం అదనంగా రూ.50 కోట్లు జమ చేయాలని డిమాండ్ చేసింది.గ్రాట్యుటీ ట్రస్ట్‌కు ఏటా రూ.16 కోట్లు జమ చేస్తుండగా, సుమారు రూ.8 కోట్లు మాత్రమే కార్మికులకు చెల్లిస్తున్నందున మిగిలే మొత్తాన్ని కూడా పదవీ విరమణ కార్మికుల ప్రయోజనాలకు వినియోగించాలని కోరింది. లేనియడల నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి అర్హత కలిగిన సంస్థను నియమించే అంశాన్ని పరిశీలించాలని యాజమాన్యానికి తెలిపింది.సమావేశంలో విసి ద్వారా డైరెక్టర్ (పా) గౌతం పోట్రూ పాల్గొనడం జరిగింది,అదేవిధంగా జీఎం వెల్ఫేర్, ఈఈఈ, ఆర్‌సీ, సీఎంఓ, జీఎం ఫైనాన్స్ సీఎంఓఏ అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ