తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆనందఖని పాత కొత్తగూడెం నందు ఈరోజు హర్ ఘర్ తీరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జండా ఊపి ప్రారంభించారు స్థానికులను ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని నినాదాలతో చైతన్య పరచడం జరిగింది. ఎంతోమంది త్యాగధనుల ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి స్వాతంత్రాన్ని అందరూ కూడా గౌరవించి జాతి గౌరవాన్ని పెంచాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూచించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ , పాఠశాల ఉపాధ్యాయ బృందం, యన్ సి సి అధికారి వీరు నాయక్ పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ