Monday, 03 August 2026 07:08:22 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

సర్ఫస్ కన్వర్షన్‌లో పివికే-5 భూగర్భ గని కార్మికులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి – ఎఐటియుసి స్పష్టమైన డిమాండ్

Date : 06 July 2026 01:55 PM Views : 237

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎఐటియుసి పోరాట ఫలితం... సర్ఫస్ జనరల్ అసిస్టెంట్స్ వెబ్ కౌన్సిలింగ్ తాత్కాలికంగా నిలిపివేత. కొత్తగూడెం ఏరియాలో భూగర్భ గనుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులతోనే సర్ఫస్ కన్వర్షన్ చేపట్టి, ఏరియాలో ఖాళీగా ఉన్న సర్ఫస్ జనరల్ అసిస్టెంట్స్ పోస్టులను భర్తీ చేయాలని గుర్తింపు సంఘం ఎఐటియుసి యాజమాన్యంపై నిరంతరం ఒత్తిడి తీసుకొచ్చింది.ఈ సందర్భంగా ఎఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ మాట్లాడుతూ, ఈ సమస్యను ఎఐటియుసి గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, భూగర్భ గని కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.ఎఐటియుసి ఒత్తిడి ఫలితంగా,ఈ నెల 8వ తేదీన నిర్వహించాల్సిన సర్ఫస్ జనరల్ అసిస్టెంట్స్ వెబ్ కౌన్సిలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం గుర్తింపు సంఘం ఎఐటియుసికి తెలిపిందన్నారు.అండర్‌గ్రౌండ్ కార్మికుల సర్ఫస్ కన్వర్షన్ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి,మణుగూరు సర్ఫస్ జనరల్ అసిస్టెంట్స్ తో సంబంధం లేకుండా ముఖ్యంగా పివికే-5 భూగర్భ గనిలో విధులు నిర్వహిస్తున్న అర్హులైన కార్మికులకే తొలి ప్రాధాన్యత కల్పించాలని ఎఐటియుసి డిమాండ్ చేసింది. అదేవిధంగా, సర్ఫస్ కన్వర్షన్ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి వి. మల్లికార్జున్ రావు, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బేరర్ హుమాయూన్, నాయకులు లక్ష్మీనారాయణ, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :