తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారు పాల్వంచ డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించినారు.సబ్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పీ ఆర్. సతీష్ కుమార్,పాల్వంచ సీఐ సతీష్,అశ్వరావుపేట సీఐ నాగరాజు రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు. సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎటువంటి నేరాలు జరగకుండా ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం డిఎస్పి కార్యాలయ పరిసరాలను పరిశీలించి,కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు
Admin
తెలుగు వెలుగు టీవీ