తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐఏఎస్, ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు నేతృత్వంలో జిల్లా రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఇండియన్ యూత్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ సౌజన్యంతో కొత్తగూడెం నగరంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో మంగళవారం ఉదయం రోడ్డు సేఫ్టీ ఎడ్యుకేషన్ (ROSE) కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఆవరణలో ఉచిత రక్షిత పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాలుపంచుకొని ఉచిత వ్యక్తపరిక్ష చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేతల మీదుగా ప్రారంభించనున్నారు. ఉచిత రక్త పరీక్ష శిబిరంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రజలు తమ యొక్క బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం సులభతరం అవుతుందని అధికారులు తెలిపారు. తద్వారా ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగిన లేదా ఏదైనా అత్యవసర సందర్భాలలో రక్తదానం చేసేందుకు సులభంగా ఉంటుందని, ఎమర్జెన్సీ సమయంలో ఇది దోహదపడుతుందని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 60 శాతం మందికి పైగానే తమ బ్లడ్ గ్రూప్ తెలియని పరిస్థితులు ఉన్నాయని, ఈ ఉచిత రక్త పరీక్ష శిబిరం ద్వారా తమ బ్లడ్ గ్రూప్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఇలా చేయించుకోవడం ద్వారా ఎదుటి వ్యక్తికి సహాయం చేయడమే కాకుండా తన యొక్క బ్లడ్ గ్రూప్ పై అవగాహన ఉండడం స్వీయ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుందని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ