తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరం లోని 16వ డివిజన్ పరిధిలో మదర్ తెరిసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 45 రోజుల శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన 40 మహిళలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ శిక్షణ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. సోమవారం అంబేద్కర్ చమన్లో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ల పంపిణీలో 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ గణేష్ మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో ఎదగడం అనేది ఎదగాలని ఆలోచన రావడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఇలాగే ప్రతి మహిళ కుటుంబంలో ఆర్థికంగా చేదోడువాదాడుగా ఉంటూ తన కాళ్లపై తన నిలబడి సమాజంలో ఒక గౌరవాన్ని పొందాలని సూచించారు. మన కొత్తగూడెం శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు సహకారంతో మహిళల స్వయం ఉపాధికి తమ వంతుగా అవకాశమున్న ప్రతి పనిని అందుబాటులోకి తేవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తామన్నారు. అనంతరం కార్పొరేటర్ మునిగడప పద్మ మాట్లాడుతూ మహిళల స్వయం ఉపాధి కోసం పాటుపడుతున్న మదర్ తెరిసా ఫౌండేషన్ స్టేట్ కోఆర్డినేటర్ సంధ్యా రెడ్డికి సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మహిళలంతా క్రమశిక్షణతో శిక్షణ పొంది వృత్తిలో రాణించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టైలరింగ్ శిక్షణ ఇచ్చిన టీచర్ కవిత, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, న్యాయవాది మునిగడప వెంకటేశ్వర్లు, శిక్షణకు వసతి గృహాన్ని అందించిన దండే భాగ్యలక్ష్మి మరియు శిక్షణ పొందిన 40 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ