తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెంలోని బూడిదగడ్డ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే, ఆలయ అర్చకులు నరేంద్ర భవాని స్వామి సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. పెద్ద సంఖ్యలో ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించేందుకు బారులు తీరారు. ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యదర్శి SK.సాబీర్ పాషా, DSP అబ్దుల్ రెహమాన్, కనుకుంట్ల కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ