తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రధాన రహదారిపై గోదావరి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. గత వారం రోజులుగా సీతమ్మ వారి నార చీరల ప్రదేశం, సీతమ్మ వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల ముంపునకు గురైంది. దీంతో పర్ణశాల రామాలయానికి భక్తులు వెళ్లలేకపోతున్నారు. భద్రాచలం వచ్చిన భక్తులు పర్ణశాల దర్శించకుండానే వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం పర్ణశాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో భక్తులు నిరాశ చెందుతున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ