Sunday, 02 August 2026 01:12:28 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

Date : 27 July 2026 08:13 PM Views : 279

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుందరీకరణతో మారనున్న పట్టణ ముఖచిత్రం. ప్రజలకు మేలైన వసతులు అందుబాటులోకి తెస్తున్నాం. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన అజెండా. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే.పట్టణ పరిధిలో రూ.2 కోట్ల డిఎంఎఫ్ నిధులతో నిర్మించిన భజన మందిర్ రోడ్డు సుందరీకరణ పనులతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ డివైడర్, టూ వే రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి వీధి దీపాలను వెలిగించిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. రోడ్డు విస్తరణ పనుల వల్ల రాకపోకలకు ఎదురవుతున్న తీవ్ర అంతరాయం తొలగిపోతుందని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాల నివారణకు ఈ లైటింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్ నుంచి గోధుమవాగు వరకు సెంట్రల్ డివైడర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. నిధుల వినియోగంలో పారదర్శకత పాటిస్తూ నాణ్యతా ప్రమాణాలతో బూడిదగడ్డ రోడ్డు అభివృద్ధి పనులు పూర్తి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పట్టణంలోని అన్ని ప్రధాన రహదారులను మోడల్ రహదారులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనలో స్థానిక సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. మంజూరైన ప్రతి పనిని నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజల వినియోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, కమిషనర్ సుజాత, కార్పొరేటర్లు, నాయకులు, వాసిరెడ్డి మురళి బోయిన విజయ్ కుమార్, నేరెళ్ల రమేష్, భూక్యా శ్రీనివాస్, యూసఫ్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, బండి నరసింహ, కొచ్చర్ల రాకేష్, సాత్విక్, ధనరాజ్, జహీర్, శాంతి ప్రియ, దుర్గయ్య, గడ్డం సతీష్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :