తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, మాదకద్రవ్యాలు, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరము లో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించా రు. జిల్లాలో నమోదవుతున్న ఎన్‌డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాధక ద్రవ్యాల వాడకం, నియంత్రణ చర్యలు, శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ విని యోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలుచేయాలని సూ చించారు. జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్, మాదకద్రవ్యాల వల్ల కలి గే నష్టాలపై వైద్య అధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ అందించేలా చర్యలు తీసుకోవాలనీ సూచించారు. డీ అడిక్షన్ సెంటర్ ద్వారా అవసర మైన వారికి చికిత్స అందించాలన్నారు. అటవీశాఖ అధికారులు వారి పరిధిలోని అటవీభూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని కలెక్టర్ డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌కు సూచించారు. ఇంటర్ కళాశాలలో మాదక ద్రవ్యలు వినియోగం వల్ల జరిగే నష్టాలు పట్ల అవగాహన కల్పించడానికి ఈ వారం లో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాలకు వ్యతి రేకంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో విద్యార్థులకు, యువతకు, ప్రజల కు, విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, యువత గంజాయి డ్రగ్స్‌వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి ర్యాగింగ్ మొదటిదశలోనే కట్టడి చేయాలని, కళాశాలల యాజమాన్యాలు, విద్యా ర్థుల అలవాట్లను, నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ఈ సమావేశం లో జడ్ పి సి ఈ ఓ నాగలక్ష్మి,ఇంటర్మీడిట్ అధికారి వేంకటేశ్వరరావు, జిల్లా వైద్య శాఖ అధికారి జయలక్ష్మి, రవాణా శాఖ అధికారి వెంకటరమణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు మరియు సంబంధిత శాఖల అధికారుల తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ