తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రాపర్టీ కేసుల పై ప్రత్యేక దృష్టి సారించాలి రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉండాలి సీసీటీఎన్‌ఎస్ 2.0 కేసుల వివరాలు సకాలంలో నమోదు చేయాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య ఎస్పీ గారికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వార్షిక తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, కార్యాలయ నిర్వహణ, రికార్డులు, సిబ్బంది నిర్వహిస్తున్న విధులు తదితర అంశాలను ఎస్పీ గారు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ దర్యాప్తుల పురోగతి, నేరాల నియంత్రణ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాపర్టీ కేసుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించి, దొంగిలించబడిన ఆస్తులను త్వరితగతిన స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించేలా దర్యాప్తు చేపట్టాలని సూచించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీసీటీఎన్‌ఎస్‌లో నమోదయ్యే కేసులు, దర్యాప్తు పురోగతి, ఇతర వివరాలను సకాలంలో నమోదు చేసి ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, మట్కా, జూదం, కోడి పందాలు, పేకాట, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా గ్రామాల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడితో బాధ్యతగా వ్యవహరించి త్వరితగతిన సేవలు అందించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య, ఎస్‌బీ-2 ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, చర్ల సీఐ రాజు వర్మ, ఎస్‌ఐలు శ్యాంప్రసాద్, జగన్మోహన్ చారి,పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ