తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం నాడు ఇల్లందు పోలీస్ స్టేషన్లో సబ్ డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు డీఎస్పీ వెంకన్నబాబు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రౌడీషీటర్లు ఇకపై ఎలాంటి నేర కార్యకలాపాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, నేరాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలు, ప్రవర్తనపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఎవరైనా బెదిరింపులు, దాడులు, అక్రమ కార్యకలాపాలు లేదా ఇతర నేరాలకు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రౌడీషీటర్లు తమ గత నేర చరిత్రను పక్కనపెట్టి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవిస్తూ, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మెలగాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని డీఎస్పీ వెంకన్నబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు సురేష్, సత్యనారాయణ, ఎస్సైలు తిరుపతి, ఉమా, సారంగపాణి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ