Saturday, 19 September 2026 06:26:12 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

భద్రాచలం గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Date : 19 September 2026 05:03 PM Views : 27

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డీజేలు, క్రాకర్స్‌కు అనుమతి లేదు: డీఎస్పీ అరుణ్ కుమార్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు గణేష్ నిమజ్జన ఏర్పాట్లను డీఎస్పీ అరుణ్ కుమార్ పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ సూచించారు. మద్యం సేవించి నిమజ్జన కార్యక్రమానికి ఎవరూ రావద్దని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని స్పష్టం చేశారు.అలాగే నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, క్రాకర్స్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిమజ్జన ప్రాంతంలో విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల భద్రత, నది పరిసరాల్లో రక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. నిమజ్జన బందోబస్తు కోసం సుమారు 200 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. నిమజ్జన ప్రాంతంలో డిడిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ రక్షణ బృందాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని డీఎస్పీ అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :