తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ జిల్లాకేంద్రంలో కలెక్టర్ కార్యాలయం నందు నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇటీవల బదిలీ అయిన భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ఆయన పదవీకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక స్థానం సంపాదించారాని ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసి మంచి అధికారిగా ఆయన గుర్తింపు పొందారని కొనియాడారు భవిష్యత్తులో మరింత ఉన్నత పదవుల్లో సేవలందించాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నూతనంగా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అంకిత్ కి జిల్లాప్రజల తరఫున స్వాగతం పలికారు. జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ప్రజాప్రతినిధులు మరియు అధికారులు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు..
Admin
తెలుగు వెలుగు టీవీ