Thursday, 17 September 2026 08:17:01 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ఐపీఎస్‌.

Date : 06 July 2026 08:40 PM Views : 295

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ఐపీఎస్‌ – మణుగూరు పోలీస్ స్టేషన్, ఏఆర్ డీఎస్పీ నివాస గృహం, పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో గెస్ట్ హౌస్ ప్రారంభం. 06వ బెటాలియన్ సందర్శించిన డిజిపి.పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి. ఆనంద్ ఐపీఎస్‌ గారిని జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా పోలీసు అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర డీజీపీతో పాటు మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ ఐపీఎస్‌ గారికి జిల్లా ఎస్పీ స్వాగతం పలికారు.అనంతరం మణుగూరులో నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ఐపీఎస్ ప్రారంభించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏఆర్ డీఎస్పీ నివాస గృహాన్ని ప్రారంభించారు. అనంతరం 6వ బెటాలియన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గౌరవ వందనం స్వీకరించి, మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ పరికరాలను పరిశీలించి, విపత్తు నిర్వహణలో సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నూతనంగా నిర్మించిన పోలీస్ గెస్ట్ హౌస్‌ను రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గెస్ట్ హౌస్‌లో కల్పించిన వసతులను పరిశీలించి, పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీసు అధికారులతో రాష్ట్ర డీజీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు.సమీక్ష సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రతి ఒక్కరూ వాటి నిర్మూలనకై కృషి చేయాలని, విద్యాసంస్థలు, యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచి, నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రతి గ్రామం, కాలనీ, వ్యాపార సముదాయం, విద్యాసంస్థలు, ప్రజా రద్దీ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పెంచాలని అధికారులను ఆదేశించారు.మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పట్ల సున్నితంగా స్పందిస్తూ, ప్రతి ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ అమలు మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌కు మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, గ్రామాలు, పట్టణాల్లో ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని తెలిపారు. సీసీటీఎన్ఎస్ 2.0 సమర్థవంతంగా వినియోగించుకొని సమాచారాన్ని పొందుపరచాలని సూచనలు చేశారు. ఇండస్ట్రియల్ దొంగతనాలు పట్ల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేరాల దర్యాప్తు నాణ్యతను మరింత మెరుగుపరచాలని సూచించారు. జిల్లాలో పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నేరస్తులకు చట్టపరంగా శిక్షలు పడేలా పటిష్టమైన దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్,జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్,డీఎస్పీలు, సీఐలు, జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :