Thursday, 17 September 2026 02:15:17 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

టేకులపల్లి లో జరిగే మహాసభను జయప్రదం చేయండి

Date : 18 January 2025 08:03 PM Views : 454

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈనెల 20న టేకులపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న తెలంగాణ ఆటో & మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధమ మహాసభ ను జయప్రదం చేయాలని టి యు సి ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎదలాపురం గోపాలరావు,తెలంగాణ ఆటో & మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు రాయల సిద్దు కోరారు.జూలూరుపాడు మండల కేంద్రంలో ఆటో కార్మికులతో కలిసి మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో జిల్లాలో ఆటో & మోటార్ కార్మికుల పరిస్థితి దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షుగా తయారయిందని,రెక్కాడితే గాని డొక్కాడని ఆటో కార్మికులు కిరాయిలు లేక నేడు ఆటో అడ్డాలపై దీన స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు . నాడు టిఆర్ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా కార్మిక వర్గాన్ని వంచించే ప్రభుత్వాలేనని నేడు అర్ధం అవుతున్నదని,ఉచిత హామీలతో ఊదరగొడుతూ, అబద్ధాలతో పాలన చేస్తూ, ఓట్లను కొల్లగొడుతూ రాష్ట్రాన్ని దివాలా తీయించే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.2023 డిసెంబర్లో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలంగాణలో ఉన్న మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పి మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారని,ఇది తెలంగాణలోని మహిళలకు ఒక వరమైంది కానీ ఆటో, క్యాబ్, జీప్, మ్యాజిక్ డ్రైవర్లకు మాత్రం శాపంగా మారిందని అన్నారు.ఆటోలో ఎక్కే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడం వలన ఆటో డ్రైవర్లకు గిరాకీ తగ్గిపోయిందని,బతుకులపై భరోసా తగ్గిందని,ఈ క్రమంలో కాంగ్రేస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలైన మోటర్ కార్మికులకు సంక్షేమ బోర్డు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మికుల ఐక్యంగా ఉద్యమించాలని, ఈ నేపథ్యంలో జరుగుతున్న తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో & మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రథమ మహాసభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు నేలాల నవీన్, కత్తి సాయి, నేలాల సీతారాములు, నూక పోగు రాంబాబు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :